![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో....... సీతాకాంత్ కి నేనంటే ఇష్టం లేదు కేవలం రామలక్ష్మి నో మైథిలి నో కన్ఫమ్ చేసుకోవడానికి నాతో ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడని చెప్పగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. మనం ఇప్పటి వరకు ఏం చేసిన కూడా కేవలం డబ్బు కోసం చేసాం... ఇప్పుడు కూడా అలాగే చేద్దాం.. సీతా అనుకుంటున్నాడు కానీ అలా జరగకూడదు.. రమ్యని పెళ్లి చేసుకోవాలని శ్రీవల్లి, సందీప్, రమ్యలతో శ్రీలత అంటుంది.
మరొకవైపు ఎందుకు సీతాకాంత్ ఎంగేజ్ మెంట్ కి వస్తానని చెప్పావని సుశీల, ఫణీంద్ర ఇద్దరు అడుగుతారు.. మరేం చేయమంటావ్ ఇక సీతా సర్ ని తనివి తీరా చూడడం కోసం అటు మైథిలిగా ఇటు రామలక్ష్మిగా సీతా సర్ కి దగ్గర కాలేకపోతున్నానని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. గుమ్మం దగ్గర రామలక్ష్మి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అంతా వినేసిందా అనుకుని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది కానీ శ్రీలత ఏం వినదు శ్రీలత లోపలికి వచ్చి.. మైథిలీ నీతో మాట్లాడాలంటూ బయటకి తీసుకొని వెళ్తుంది. సీతా, రమ్యతో ఎంగేజ్ మెంట్ అని నాటకం ఆడుతున్నాడు.. నువ్వు రామలక్ష్మి వో మైథిలి వో తెలుసుకోవడానికి ఇదంతా ప్లాన్ అని శ్రీలత చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. మా సీతా రమ్యని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఇక నువ్వు రేపు ఎంగేజ్ మెంట్ కి వస్తావో రావో ఇక నీ ఇష్టమని శ్రీలత చెప్పి వెళ్తుంది.
ఆ తర్వాత శ్రీలత వెళ్ళిపోయాక రామలక్ష్మి ఇంట్లోకి వెళ్తుంది. శ్రీలత మాట్లాడింది మొత్తం ఫణీంద్ర వాళ్ళకి రామలక్ష్మి చెప్తుంది. అదంతా విని తన మాటల బట్టి తనేలాంటిదో తెలుస్తుందని సుశీల అంటుంది. అసలు ఈ రమ్య ఎవరు అని రామలక్ష్మి అంటుంది. నేనొక నంబర్ ఇస్తాను అతన్ని కలిసి విషయం చెప్పు.. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడని ఫణీంద్ర అంటాడు. దాంతో రామలక్ష్మి అతన్ని వెళ్లి కలిసి రమ్య ఫోటో చూపిస్తుంది. అప్పుడే రమ్య వెళ్తుంటుంది. తన గురించి తెలుసుకోవడానికి ఇద్దరు చాటుగా తనని చూస్తారు. రమ్య ఇల్లు కొనడానికి అడ్వాన్స్ తో వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |